మెగాస్టార్ మాస్ పోస్టర్ తో “వాల్తేరు వీరయ్య” రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన టీమ్!

మెగాస్టార్ మాస్ పోస్టర్ తో “వాల్తేరు వీరయ్య” రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన టీమ్!

Published on Dec 7, 2022 4:26 PM IST

మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య అభిమానులకు మరియు ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం కి సంబంధించిన నిర్మాణ పనులు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి రానున్న సంగతి తెలిసిందే. మేకర్స్ అధికారికంగా ప్రకటించినట్లుగా ఇది జనవరి 13, 2023న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

చిరంజీవి సంక్రాంతికి చాలా బ్లాక్‌బస్టర్‌లను అందించారు. పండుగకు థియేటర్లలో మాస్ పార్టీని అందించడానికి మరొక బ్లాక్‌బస్టర్ లోడ్ అవుతోంది. విడుదల తేదీ పోస్టర్‌లో చిరంజీవి వింటెజ్ మాస్ అవతార్‌లో లుంగీ మరియు వైబ్రెంట్ షర్ట్‌తో హెడ్‌బ్యాండ్‌తో ఉన్నారు. ఈ పోస్టర్ పూనకాలు ఇచ్చేలా ఉంది. బాస్ పార్టీ పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా మారడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి.

బాస్ పార్టీ నిజమైన DSP స్టైల్‌లో మసాలా నంబర్ మరియు చిరంజీవి డ్యాన్స్‌లు చూడటానికి ట్రీట్‌గా ఉంటాయి. ఊర్వశి రౌతేలా చిరంజీవి సరసన డాన్స్ చేయడం జరిగింది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.

చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వం కెఎస్ రవీంద్ర (బాబీ కొల్లి), నిర్మాతలు నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, DOP ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్ నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్, సహ నిర్మాతలు GK మోహన్, ప్రవీణ్ M, స్క్రీన్ ప్లే కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి, అదనపు రచన హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి, CEO చెర్రీ, కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత కొణిదెల, లైన్ ప్రొడ్యూసర్ బాలసుబ్రహ్మణ్యం, కె.వి.వి, PRO వంశీ – శేఖర్, పబ్లిసిటీ బాబా సాయి కుమార్, మార్కెటింగ్ ఫస్ట్ షో లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు