కపిల్‌ దేవ్‌ తో మెగాస్టార్ దంపతులు !

Published on Aug 30, 2021 10:00 am IST

మెగాస్టార్ చిరంజీవి, మాజీ స్టార్ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ కలిసి దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పైగా మెగాస్టారే ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ‘చాలాకాలం తర్వాత నా స్నేహితుడు కపిల్‌ దేవ్‌ ను కలుసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఆయనతో పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకున్నాం’ అంటూ మెగాస్టార్ మెసేజ్ చేశారు.

ఇంతకీ కపిల్ అండ్ మెగాస్టార్ ఎక్కడ కలుసుకున్నారు అంటే.. హైదరాబాద్‌ లోని ఓ హోటల్‌ లో అనుకోకుండా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ఫోటోలు దిగారు. ఇక లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్నాడు.

కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ బయోపిక్ చిత్రాన్ని విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున విడుదల చేస్తున్నారు. ’83’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983లో వెస్ట్ ఇండీస్ పై ఫైనల్ లో విజయం సాధించి వరల్డ్ కప్ ను ఎలా చేజిక్కించుకున్నారు ? వంటి అంశాలను చూపించనున్నారు.

సంబంధిత సమాచారం :