మాటలకి అందని విషాదం ఇది – కృష్ణ గారి మరణం పట్ల మెగాస్టార్

మాటలకి అందని విషాదం ఇది – కృష్ణ గారి మరణం పట్ల మెగాస్టార్

Published on Nov 15, 2022 10:57 AM IST

టాలీవుడ్ దిగ్గజ నటులు సూపర్ స్టార్ కృష్ణ గురై మరణ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యింది. దీనితో సూపర్ స్టార్ వారసుడు మహేష్ బాబు కి టాలీవుడ్ నుంచి అనేకమంది ప్రముఖులు ధైర్యం చెబుతు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఘటనపై అయితే టాలీవుడ్ మరో దిగ్గజ నటులు మెగాస్టార్ చిరంజీవి ఎంతో భావోద్వేగంతో పలు అమూల్యమైన మాటలు సూపర్ స్టార్ కృష్ణ గారి కోసం పంచుకున్నారు.

“మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి వూపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమ లోనే కాదు, భారత సినీపరిశ్రమ లోనే అరుదు.

తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, తన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకొంటున్నాను.” అని కృష్ణ గారి వన్నె ని కొనియాడి మహేష్ కి ధైర్యం చెబుతూ మెగాస్టార్ అయితే పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు