భారీ ఓపెనింగ్స్ కొట్టేందుకు రెడీ అయిన ఖైదీ!
Published on Jan 11, 2017 6:00 am IST

khaidi
మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత సినిమాలకు రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘ఖైదీ నంబర్ 150’. ఆయన కెరీర్‌కు 150వ సినిమా కూడా కావడంతో ఖైదీపై మొదట్నుంచీ అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఆ అంచనాల మధ్యనే నేడు ప్రేక్షకుల ముందుకొచ్చేసిన ఈ సినిమా, ఓపెనింగ్స్ పరంగా రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ భావిస్తోంది. సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఇప్పటికే మూడు రోజుల పాటు అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తవ్వడం, అమెరికాలో ప్రీమియర్ షోస్‌తోనే 1 మిలియన్ డాలర్లు వచ్చే సూచనలు కనిపించడం.. ఇలా అన్నీ ఖైదీ నంబర్ 150 ఓపెనింగ్ డే కలెక్షన్స్ భారీగా ఉండనున్నాయని స్పష్టం చేస్తున్నాయి.

తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘బాహుబలి’ స్థాయిలో ఖైదీ నంబర్ 150 ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ఇటు ట్రేడ్, అటు అభిమానులు భావిస్తున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు రైతుల కోసం పోరాడే యువకుడిగా కనిపిస్తారు. తమిళంలో ఘన విజయం సాధించిన కత్తికి రీమేక్ అయిన ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

 
Like us on Facebook