రాజమౌళితో భారీ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి.!

Published on Apr 27, 2022 12:00 pm IST

టాలీవుడ్ నుంచి ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి గాను దర్శకుడు రాజమౌళి రాగా మెగాస్టార్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరి ఇదే గ్యాప్ లో రాజమౌళి మరియు మెగాస్టార్ ల కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది అని బజ్ బయటకి వచ్చింది. అయితే ఇప్పుడు దీనిపై మెగాస్టార్ లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇవ్వడం జరిగింది.

మా ఇద్దరి కాంబోలో వస్తున్న ఊహాగానాలపై ఎలాంటి నిజం లేదని తనతో వర్క్ వస్తే చేస్తానని కానీ అది జరిగే అవకాశం అయితే లేదని నేను అనుకుంటున్నానని చిరు తెలిపారు. దీనితో ఈ కాంబోపై అయితే ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :