వైరల్ : “గాడ్ ఫాథర్” రిలీజ్ ని కన్ఫర్మ్ చేసేసిన మెగాస్టార్.!

Published on Jun 19, 2022 7:03 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో దర్శకుడు మోహన్ రాజాతో చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రమే “గాడ్ ఫాథర్”. మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం మళయాళ హిట్ లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. అయితే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై బిగ్ క్లారిటీ వచ్చిందని చెప్పాలి.

మెగాస్టార్ లేటెస్ట్ గా అటెండ్ అయ్యిన ఓ ఓటీటీ ప్రోగ్రాం లో తమ గాడ్ ఫాథర్ ని ఆగస్ట్ గాని సెప్టెంబర్ లో గాని రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని కన్ఫర్మ్ చేశారు. ఇది వరకే ఈ సినిమా ఆగస్ట్ 12 అలా రిలీజ్ అవుతుందని బజ్ బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ వైపు నుంచి కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక చిత్ర యూనిట్ నుంచి అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :