సాయి తేజ్ ఆరోగ్యంపై కొత్త అప్డేట్ ని వెల్లడించిన మెగాస్టార్.!

Published on Sep 11, 2021 7:05 am IST

సుప్రీమ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిన్న అనూహ్యంగా ఓ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదం అనంతరం హుటాహుటిన సాయి తేజ్ ఓ హాస్పిటల్ లో అడ్మిట్ చెయ్యడం వెను వెంటనే చికిత్స చెయ్యడం కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు అనేంత వరకు కూడా ఇండస్ట్రీ వర్గాలు అభిమానులు ప్రశాంతంగా ఊపిరి తీసుకోలేకపోయాయి. మరి ఈ ప్రమాదం కోసం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ కూడా వెంటనే హాస్పిటల్ కి చేరుకున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి సాయి తేజ్ ని వేరే హాస్పిటల్ కి మార్పించి తన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. మరి అలానే సాయి తేజ్ ఆరోగ్యం ఎలా ఉంది అన్న దానిపై అధికారిక ప్రెస్ నోట్ ని అపోలో నుంచి విడుదల చేసారు. మరి అందులో సాయి తేజ్ కి పెద్ద గాయాలు ఎక్కడా తగల్లేదు అని మెదడు, మోకాళ్లకి ఇంకా ఇతర అవయవాలుకి పెద్ద గాయాలు తగలకుండా ఉండటం మూలాన ఏం కాలేదని కాకపోతే మెడ దగ్గర ఎముక వద్ద చిన్నపాటి కణజాలం దెబ్బ తింది అని పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. అంతా సవ్యంగానే ఉందని పేర్కొంది. తర్వాత ఆరోగ్యపు అప్డేట్ రేపు ఉదయం 9 గంటలకి విడుదల చేస్తామని తెలిపారు. దీనిని చిరు అభిమానులు అందరికీ పంచుకుని వారికి ధైర్యం చెప్పారు.

సంబంధిత సమాచారం :