“ఆచార్య” ట్రైలర్..ఫస్ట్ ఎవర్ మెగా రికార్డుకి చేరువలో చిరు.!

Published on Apr 14, 2022 10:00 am IST

మన టాలీవుడ్ దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా నుంచి మేకర్స్ రీసెంట్ గానే అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ చెయ్యగా ఇది ఆల్ టైం రికార్డ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

అయితే ఈ ట్రైలర్ పరంగా అయితే మన సీనియర్ హీరోస్ లో మెగాస్టార్ మాత్రం ఫస్ట్ ఎవర్ రికార్డ్ సెట్ చెయ్యడానికి అతి చేరువలో ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతం ఈ మాసివ్ ట్రైలర్ ఏకంగా 9 లక్షల 50 వేల లైక్స్ ని హిట్ చేసింది. ఇది ఓ సాలిడ్ రికార్డు అని చెప్పాలి. అలాగే ఇదే స్పీడ్ లో 1 మిలియన్ లైక్స్ కూడా ఎంతో కష్టమేమి కాదని చెప్పాలి.

మరి ఇదే నిజం అయితే మాత్రం 1 మిలియన్ లైక్డ్ ట్రైలర్ కలిగిన ఏకైక సౌత్ ఇండియా సీనియర్ స్టార్ హీరోగా మెగా స్టార్ నిలుస్తారు. మరి బహుశా ఇది ఈ రెండు రోజుల్లోపే క్రాస్ అయ్యిపోవచ్చని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :