“వాల్తేరు వీరయ్య” సాంగ్ పై చిరు నుంచి ఇంట్రెస్టింగ్ పోస్ట్,!

“వాల్తేరు వీరయ్య” సాంగ్ పై చిరు నుంచి ఇంట్రెస్టింగ్ పోస్ట్,!

Published on Nov 22, 2022 4:00 PM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు బాబీ తో చేస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మాస్ సహా మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ రేపు బాస్ పార్టీ అంటూ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తుండగా ఈరోజు అయితే దాని తాలూకా ప్రోమోని అయితే మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సాంగ్ కోసం ఇప్పుడు స్వయంగా మెగాస్టార్ ఓ ప్రత్యకమైన పోస్ట్ పెట్టడం విశేషంగా మారింది. రేపు రాబోతున్న బాస్ పార్టీ సాంగ్ లో శేఖర్ కొరియోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ ఫుట్ టాపింగ్ మ్యూజిక్ అలాగే ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రఫీ అలాగే ప్రత్యేకంగా అయితే డైరెక్టర్ బాబీ ఆలోచనకి తగ్గట్టుగా ఆర్ట్ వర్క్ తో అద్భుతమైన సెట్స్ ఇచ్చిన ఏ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్స్ డిజైన్ కోసం చెప్పాలని తెలిపారు.

అలాగే ఈ సినిమా కోసం ముఖ్యంగా ఈ సాంగ్ లో అతడు అందించిన ఆర్ట్ వర్క్ ఎంతో మెప్పించింది అని చిరు కొనియాడారు. అలాగే తమకి ఎంతో నచ్చిన ఈ సాంగ్ రేపు అందరికీ కూడా నచ్చుతుంది అని చిరు అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి ఈ సాంగ్ సెట్టింగ్స్ అండ్ పూర్తి సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాల వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు