మెగాస్టార్ ఉదారత..అభిమానికి మెగా సహాయం.!

Published on Oct 23, 2021 8:00 am IST

మెగాస్టార్ చిరంజీవి అంటే వెండితెరపై కనిపించి అభిమానులను అలరించే నటుడే కాదు నిజ జీవితంలో ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునే ఆపద్భాందవుడు కూడా అని అందరికీ తెలుసు. ఇప్పటి వరకు ఎన్నో సాయాలు ఎందరికో గుప్త దానాలు చేసిన మెగాస్టార్ గత లాక్ డౌన్ లో ఆక్సిజన్ అందజేసి ప్రాణదాతగా కూడా నిలిచారు. మరి ఇదిలా ఉండగా చిరు ఇపుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ అభిమానికి ఎంతైనా ఖర్చు చేసి బ్రతికించేందుకు సిద్ధం అయ్యారు.

ఇక అసలు విషయంలోకి వెళ్లినట్టయితే విశాఖ జిల్లాకి చెందిన చిరంజీవి అభిమాని వెంకట్ క్యాన్సర్ వ్యాధికి గురి అయ్యి పోరాడుతున్నారు. అయితే ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు చిరు దృష్టికి తీసుకెళ్లగా వెంకట్ ను వెంటనే హైదరాబాద్ కు మెరుగైన వైద్యం కోసం తరలించమని పూర్తిగా వైద్య ఖర్చులు తాను భరిస్తానని హామీ ఇచ్చి తన ఉదారత చాటుకున్నారు. దీనితో ఇతర మెగా అభిమానులు చిరు విషయంపై మరింత గర్వం వ్యక్తపరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More