స్టార్ డైరెక్టర్ సినిమాలో ‘చిరు’ సరసన అనుష్క ?

రచయితగా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కాగా ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రైతు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కోసం గతకొంతకాలంగా కొరటాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం, కొరటాల శివ తన తొలి చిత్రం ‘మిర్చి’లో హీరోయిన్ గా నటించిన అనుష్క శెట్టిని, మెగాస్టార్ తో చేయబోయే సినిమా కోసం హీరోయిన్ గా తీసుకోనున్నారని అనుష్క కూడా నటించడానికి అంగీకరించదని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే చిరు పక్కన అనుష్క నటించడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఇక ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ప్రారంభం కాబోతోంద‌ని తెలుస్తోంది.