‘రిపబ్లిక్’ ట్రైలర్..దేవా నుంచి మరో ఇంటెన్సివ్ డ్రామా

Published on Sep 22, 2021 10:57 am IST


ఇటీవల సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యి క్రమంగా కోలుకుంటున్న సంగతి తెలిసిందే. మరి తాను చికిత్స పొందుతుండగానే అతను నటించిన లేటెస్ట్ సినిమా “రిపబ్లిక్” రిలీజ్ కి కూడా రెడీ అయ్యింది. విలక్షణ దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా ట్రైలర్ ని లాంచ్ చేసారు. అయితే ట్రైలర్ విషయంలోకి వెళ్లే ముందు చిరు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ప్రస్తుత అప్డేట్ ని వెల్లడించారు.

“సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష.” అని తెలిపారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే సాయి తేజ్ చేసిన లాస్ట్ మూడు హిట్స్ తో చూస్తే ఇది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది నార్మల్ గా దేవా కట్ట సినిమాలు అంటేనే ఆసక్తికరంగా చాలా బలమైన పాయింట్స్ కనిపిస్తాయి. మరి ఈ ట్రైలర్ చూసాక కూడా అదే అనిపిస్తుంది. సినిమాలో సాయి తేజ్ సహా, రమ్య కృష్ణ సాలిడ్ నెగిటివ్ రోల్, జగపతిబాబు ఇలా ప్రతి ఒక్కరి పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఒక కలెక్టర్ గా సాయి తేజ్ ప్రజలతో వారిని చైతన్యం చేసే విధంగా కొంతమంది అసాంఘిక శక్తులకు ప్రభుత్వాలే అండగా ఉంటే దానిని తాను ఎదుర్కొంటూ ప్రజల తరపున పోరాటం చెయ్యడం అనేవి దేవా విజన్ ను తన ముక్కుసూటితనం ను మరోసారి చూపిస్తున్నాయి. అంతే కాకుండా డైలాగ్స్ కూడా ట్రైలర్ లో హైలైట్ గా ఉన్నాయ్.

ఇంకా ట్రైలర్ లో మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ప్రస్థానం తర్వాత దేవా కట్ట నుంచి ఈ రిపబ్లిక్ మరో హార్డ్ హిట్టింగ్ సినిమాగా ఉండేలా అనిపిస్తుంది. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే అక్టోబర్ 1 వరకు వేచి చూడాల్సిందే.

రిపబ్లిక్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :