సహనం కోల్పోయిన చిరు..?తన మాటలు వైరల్.!

Published on Nov 18, 2021 9:00 am IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి పలు కీలక కార్యక్రమాల్లో కూడా మెగాస్టార్ ఇప్పుడు చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ఇటీవల తెలుగు సినిమాకి తీరని ఇబ్బందిగా మారినటువంటి ఆంధ్ర రాష్ట్ర టికెట్ ధరల సమస్య అనేక సార్లు ప్రస్తావనకు వచ్చింది.

అలాగే దీనిపై చిరు కూడా పలు సందర్భాల్లో చెప్పి వినమ్రంగా తన విన్నపాన్ని టాలీవుడ్ తరపున తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సమస్యకు సంబంధించే చిరు చేసిన కీలక వ్యాఖ్యలు అంటూ కొన్ని వైరల్ అవుతున్నాయి. తాజాగా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ కి చిరు హాజరు కాగా ఆ వేదికపై చిరు అసహనం వ్యక్తం చేశారట.

అస్లు టికెట్ రేట్ లు మీరు ఎలా ఖరారు చేస్తారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేందుకే అధిక బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నామని అలాంటప్పుడు టికెట్ ధర ఇంతే ఉండాలి అంటే పెద్ద సినిమాలు ఎలా తీయగలం అని చిరు ప్రశ్నించారట. దీనితో ఈ మాటలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే దీనికి సంబంధించి వీడియో కూడా రానుంది అని మరో టాక్ ఉంది.

సంబంధిత సమాచారం :

More