మెగాస్టార్ మ్యాజికల్ సాంగ్ కి భారీ రెస్పాన్స్..!

Published on Jan 4, 2022 7:06 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ సినిమా “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ భారీ సినిమా నుంచి నిన్ననే మోస్ట్ అవైటెడ్ మూడో సాంగ్ కూడా వచ్చింది. మరి ఐటమ్ నెంబర్ గా వచ్చిన ఈ సాంగ్ సూపర్ రెస్పాన్స్ ని ఇప్పుడు కొల్లగొడుతుంది. మామూలు గానే మొదటి నుంచే మెగాస్టార్ మరియు మణిశర్మ కాంబో అంటే ఒక మ్యాజిక్ అని ముద్ర ఉండిపోయింది.

దీనితో ఈ కాంబో అనౌన్స్ చేసినప్పుడే చాలా ఆసక్తి రేగింది. ఇక ఫస్ట్ సింగిల్ లాంచ్ అయ్యాక అంతా వింటేజ్ కాంబో బ్యాక్ అనుకున్నారు. ఇక ఇప్పుడు మూడో సాంగ్ కూడా అలాగే ఆదరగొడుతుంది. కేవలం 14 గంటల్లోనే 7.3 మిలియన్ భారీ వ్యూస్ అందుకుంది. ఇక అలాగే 2 లక్షలకు పైగా లైక్స్ ఈ సాంగ్ అందుకుంది.

మొత్తానికి మాత్రం మళ్లీ మెగాస్టార్ మ్యాజికల్ కాంబో అదే మ్యాజిక్ ని చేసి సూపర్ ట్రీట్ ఇస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటించగా కాజల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటించారు.

సంబంధిత సమాచారం :