మెగా వైరల్ పిక్ : గ్యాంగ్ లీడర్ – వాల్తేరు వీరయ్య : టైం గ్యాప్ అంతే టైమింగ్ లో కాదు

మెగా వైరల్ పిక్ : గ్యాంగ్ లీడర్ – వాల్తేరు వీరయ్య : టైం గ్యాప్ అంతే టైమింగ్ లో కాదు

Published on Dec 25, 2022 3:02 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మొదటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల వాల్తేరు వీరయ్య నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకోగా డిసెంబర్ 26న టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు నిన్న మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.

కాగా వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి మాస్ లుక్ తో చేతిలో ఫైర్ పట్టుకుని ఉన్న పోస్టర్ తో అదరగొట్టారు. సరిగ్గా అదే మాదిరి స్టిల్ గతంలో కొన్నేళ్ల క్రితం మెగాస్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ గ్యాంగ్ లీడర్ విడుదల టైంలో వచ్చింది. కాగా అప్పటి గ్యాంగ్ లీడర్ స్టిల్ ని ఇప్పటి వాల్తేరు వీరయ్య స్టిల్ తో కంపేర్ చేస్తూ కొందరు మెగా ఫ్యాన్స్ ఒక పిక్ ని ఎడిట్ చేసి రిలీజ్ చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. కాగా మెగాస్టార్ కెరీర్ లో టైం గ్యాప్ మాత్రమే వచ్చిందని, టైమింగ్ లో గ్యాప్ కాదని పలువురు మెగా ఫ్యాన్స్ ఆ పిక్ పై సోషల్ మీడియాలో ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు