కృష్ణవంశీ కోసం మెగా వాయిస్ ఇచ్చిన మెగాస్టార్.!

Published on Oct 26, 2021 1:00 pm IST

టాలీవుడ్ రిమార్కబుల్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ లో దర్శకుడు కృష్ణ వంశీ కూడా ఒకరు. తనదైన సినిమాలతో టాలీవుడ్ లో ముద్ర వేసిన కృష్ణ వంశీ ప్రస్తుతం తన “రంగ మార్తాండ” సినిమాతో బిజీగా ఉన్నారు. పలువురు సినీ కీలక నటీనటులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దర్శకుడు కృష్ణ వంశీ ఇప్పుడు ఆసక్తికర బిగ్ అప్డేట్ ని అందించారు.

ఈ చిత్రానికి గాను టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ఓవర్ ని అందిస్తుండగా ఈ విషయాన్నే తెలుపుతూ “తన మెగా వాయిస్ అందిస్తున్నందుకు అన్నయ్య చిరంజీవి థాంక్స్ చెబుతున్నాని” కృష్ణ వంశీ తెలిపారు. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కృష్ణవంశీ సతీమణి రమ్య కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తుండగా గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మరియు నటి శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ లు కూడా కీ రోల్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :