మన టాలీవుడ్ సినిమా దగ్గర మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టుగానే మళయాళ సినిమా దగ్గర కూడా మోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఉన్న సంగతి తెలిసిందే. మరి తాను రీసెంట్ గా నటించిన “కన్నూర్ స్క్వాడ్” ఓటిటిలో వచ్చి మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత తాను నటించిన చిత్రం “కాదల్ ది కోర్”. మరి ఈ చిత్రం ఈ నవంబర్ 23న అయితే రిలీజ్ థియేట్రికల్ గా రిలీజ్ కావడానికి సిద్ధం అయ్యింది.
అయితే ఈ సినిమా రిలీజ్ కి కువైట్, ఖతర్ దేశాల్లో అయితే అడ్డంకి పడినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఉన్న అడల్ట్ కంటెంట్ మూలాన అయితే ఈ చిత్రం రిలీజ్ కి ఆ దేశాల్లో బ్యాన్ చేసినట్టుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో మమ్ముట్టికి జ్యోతిక ఫిమేల్ లీడ్ లో నటించగా జో బేబీ దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రాన్ని మమ్ముట్టి మరియు వేఫారెర్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.