సరికొత్త మాస్ అవతార్ తో మెగాస్టార్ “వాల్తేరు వీరయ్య”.!

Published on Dec 16, 2022 10:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ బ్లాస్ట్ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మరి మెగాస్టార్ తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా స్క్రీన్ షేర్ చేసుకునున్న ఈ అవైటెడ్ చిత్రంపై మరింత హైప్ నెలకొనగా ఈ ఒక్క చిత్రంలోనే మెగాస్టార్ పలు భిన్నమైన షేడ్స్ లో కనిపిస్తూ అలరించడం విశేషం.

మరి టైటిల్ టీజర్ లో పక్కా మాస్ పాత్రలో తాను కనిపించగా ఇప్పుడు ఓ సాలిడ్ పోస్టర్ ని అయితే దానికి పూర్తి భిన్నంగా మేకర్స్ రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది. మరి ఇందులో అయితే బాస్ తన ప్రాంగణంలో అంతా గన్స్ అలాగే చేతికి సంకెళ్లు చూస్తుంటే ఓ క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లా ఇది అనిపిస్తుంది.

మరి దీనితో పాటుగా చిరు మంచి స్టైలిష్ అవతార్ లో కూడా కనిపిస్తున్నారు. దీనితో మేకర్స్ మరింత హైప్ ని సినిమాపై తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం అయితే వరల్డ్ వైడ్ జనవరి 13న రిలీజ్ కాబోతుండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :