తారకరత్న పై చిరు లేటెస్ట్ పోస్ట్ వైరల్.!

Published on Jan 31, 2023 10:03 am IST


ఇటీవలే నందమూరి కుటుంబ ప్రముఖ నటుడు అలాగే రాజకీయ నాయకుడు అయినటువంటి నందమూరి తారక రత్న ఆకస్మిక గుండెపోటు కి గురైన సంగతి తెలిసిందే. అయితే తన కండిషన్ మొదటి మూడు రోజుల్లో కాస్త సీరియస్ గా మారగా తన కుటుంబీకులు అంతా కూడా తారక రత్న కోసం బెంగళూరు కి వెళ్లారు. అయితే నిన్ననే ఎట్టకేలకు తన ఆరోగ్యంపై శుభవార్త బయటకి రావడంతో అభిమానులు మరియు సినీ వర్గాల వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ఇక లేటెస్ట్ గా అయితే మెగాస్టార్ చిరంజీవి ఓ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. “సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు.” అంటూ మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు. మెగాస్టార్ బ్యూటిఫుల్ గెస్చర్ తో మెగా మరియు నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :