“RRR” ట్రైలర్ పై మెగాస్టార్ పవర్ ఫుల్ రియాక్షన్.!

“RRR” ట్రైలర్ పై మెగాస్టార్ పవర్ ఫుల్ రియాక్షన్.!

Published on Dec 9, 2021 4:01 PM IST

ఇపుడు పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులను ఇండస్ట్రీ లను షేక్ చేస్తున్న మాసివ్ ట్రైలర్ కట్ “RRR” సినిమా ట్రైలర్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన భారీ పీరియాడిక్ డ్రామా “రౌద్రం రణం రుధిరం”.

ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న ట్రైలర్ ని ఎట్టకేలకు ఈరోజు అత్యంత గ్రాండ్ గా రిలీజ్ చెయ్యగా ఎక్కడా తగ్గకుండా మాసివ్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి అందుకుంటుంది.

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు ఈ ట్రైలర్ చూసాక తమ సాలిడ్ రియాక్షన్ ని అందించగా ఇప్పుడు లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి తన పవర్ ఫుల్ రియాక్షన్ ని ఎంతో ఎగ్జైటింగ్ గా తెలిపారు. RRR ట్రైలర్ భీబత్సం.. ఇక ప్రభంజనం కోసం వచ్చే జనవరి 7 వరకు ఎదురు చూస్తుంటాను అని తనదైన శైలి రియాక్షన్ అందించారు. దీనితో ఈ రిప్లై ఇప్పుడు మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు