‘RX 100’ రీమేక్ “తడప్” ట్రైలర్ పై మెగాస్టార్ రియాక్షన్.!

‘RX 100’ రీమేక్ “తడప్” ట్రైలర్ పై మెగాస్టార్ రియాక్షన్.!

Published on Oct 27, 2021 2:00 PM IST


ఇప్పుడు న్యూ ఏజ్ టాలీవుడ్ లో యూత్ ఫుల్ హిట్స్ గా నిలబడ్డ కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ మరియు అజయ్ భూపతిల కాంబోలో వచ్చిన లేటెస్ట్ సినిమా “ఆర్ ఎక్స్ 100” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో “తడప్” పేరుతో ఆహాన్ శెట్టి హీరోగా తారా సుతారియా హీరోయిన్ గా దర్శకుడు మిలాన్ లుత్రియా తెరకెక్కించారు.

మరి ఈ సినిమా నుంచి ఇప్పుడు మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ కట్ ని రిలీజ్ చెయ్యగా మెగా స్టార్ చిరంజీవి దీనిని రా అండ్ ఇంటెన్స్ ఉందని అభివర్ణించారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే బాలీవుడ్ ఆడియెన్స్ కోరుకునే విధంగానే సాలిడ్ విజువల్స్, యాక్షన్ తో నిండి ఉంది.

అలాగే హీరో ఆహాన్ రెండు వేరియేషన్స్ లో కూడా మంచి లుక్స్ లో కనిపించాడు. అలాగే తారా సుతారియా కూడా మంచి గ్లామరస్ గా పాయల్ రోల్ ని రీప్లేస్ చేస్తూ కనిపిస్తుంది. అలాగే విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇందులో బాగున్నాయి. మరి ఓవరాల్ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు