వైరల్ : “వాల్తేరు వీరయ్య” రివ్యూ ముందే చెప్పేసిన చిరు.!

వైరల్ : “వాల్తేరు వీరయ్య” రివ్యూ ముందే చెప్పేసిన చిరు.!

Published on Dec 28, 2022 8:00 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. మెగా ఫ్యాన్ దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం విషయంలో మాత్రం మేకర్స్ అంతా కూడా సాలిడ్ కాన్ఫిడెంట్ గా ఉండగా నిన్న చిత్ర యూనిట్ అంతా కలిసి ఓ ప్రెస్ మీట్ నిర్వహించగా ఇది కూడా సూపర్ సక్సెస్ అయ్యింది.

ఇక దీనితో సినిమాపై మరిన్ని అంచనాలు అయితే నెలకొనగా ఈ ప్రెస్ మీట్ లో సినిమాపై మెగాస్టార్ తన రివ్యూ ని చెప్పేయడం సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. “వాల్తేరు వీరయ్య” రొటీన్ యాక్షన్ ఎంటర్టైనరే కానీ సినిమాలో లోపల మాత్రం అదిరే ఎలిమెంట్ ఉంది అని తాను చెప్పారు. అలాగే దీనికి అద్భుతమైన వివరణ కూడా చిరు అందించారు.

ఇంట్లో అమ్మ ప్రతిరోజు వంట చేస్తుంది అది రోజు రొటీన్ నే కానీ అందులో కూడా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అలాంటిదే వాల్తేరు వీరయ్య అంటూ చిరు తన సినిమాపై ఇంట్రెస్టింగ్ రివ్యూ ఇచ్చేసారు. ఇక ఈ చిత్రం అయితే జనవరి 13న తెలుగు సహా హిందీలో రిలీజ్ కాబోతుండగా అభిమానులు సహా మేకర్స్ కూడా ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు