కరోనా ఎఫెక్ట్..”ఆచార్య” కూడా వాయిదా..!

Published on Jan 15, 2022 4:00 pm IST

ఈ ఏడాది ఆరంభంలోనే కరోనా ప్రభావంతో టాలీవుడ్ భారీ సినిమాలు అన్నీ నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ వాయిదాల పరంపర మరింత కొనసాగి మరికొన్ని భారీ సినిమాలు ఆగిపోయాయి. అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మరో భారీ సినిమా అయినటువంటి “ఆచార్య” సినిమాపై కూడా పడింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే లు కూడా కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాని వచ్చే ఫిబ్రవరి 4న రిలీజ్ కి ఫిక్స్ చేశారు కానీ మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాని ఈ డేట్ కి రిలీజ్ చెయ్యట్లేదు అన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అలాగే కొత్త డేట్ ని కూడా త్వరలోనే ప్రకటిస్తున్నట్టు తెలిపారు. మరి ఇది మెగాఫ్యాన్స్ కి కాస్త డిజప్పాయింటింగ్ వార్తే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందివ్వగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :