స్లో పాయిజన్ లా ఎక్కుతున్న చిరు “బాస్ పార్టీ”.!

Published on Nov 26, 2022 8:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. మెగాస్టార్ నటిస్తున్న 154వ సినిమా కాగా ఈ చిత్రంలో అయితే మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం నుంచి అయితే ఫస్ట్ సింగిల్ గా బాస్ పార్టీ అంటూ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పక్కా మాస్ నెంబర్ ప్రోమో నుంచే సోషల్ మీడియాలో మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది.

కానీ తన గత పాటల్లానే ఈ సాంగ్ కూడా ఇప్పుడు క్రేజీ రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ గా నిలవడం విశేషం. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ అమితంగా ఇంప్రెస్ చేసిన ఈ సాంగ్ అయితే ఇప్పుడు ఓ స్లో పాయిజన్ లా దూసుకెళ్తుంది. దీనిబట్టి అయితే డీఎస్పీ కి మాస్ పల్స్ ఎలా పట్టుకోవాలో తెలుసనీ మరోసారి ఈ విషయంలో అయితే దేవి సక్సెస్ అయ్యాడని మరికొందరు అంటున్నారు. మొత్తానికి అయితే వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ మాత్రం ఇప్పుడు అదరగొడుతుంది.

సంబంధిత సమాచారం :