మెగాస్టార్ గ్రాండ్ కం బ్యాక్ వైబ్స్ మొదలయ్యాయా.?

Published on Jul 2, 2022 10:04 am IST

టాలీవుడ్ లెజెండరీ స్టార్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఆరు పదులు వయసు మీద పడినా కూడా తన 20లలో ఎంతలా నిరంతరం వర్క్ చేసేవారో ఇప్పుడు కూడా ఏకకాలంలో మూడు నాలుగు సినిమాలు చేసేస్తున్నారు. మరి ఇప్పుడు మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలు షూటింగ్ లు శరవేగంగా జరుగుతుండగా లేటెస్ట్ గా మోస్ట్ అవైటెడ్ సినిమా “గాడ్ ఫాథర్” పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.

అయితే దీనికి ముందు చిరు నటించిన “ఆచార్య” ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. కానీ ఇప్పుడు గాడ్ ఫాథర్ నుంచి మాత్రం సాలిడ్ వైబ్స్ మొదలయ్యినట్టు అనిపిస్తుంది. జస్ట్ ప్రీ లుక్ పోస్టర్ మంచి ఆసక్తిగా రేపగా గాడ్ ఫాథర్ తో అయితే చిరు రేంజ్ గ్రాండ్ కం బ్యాక్ వచ్చే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. మరి చిరు అయితే మళ్ళీ తన లెవెల్ కం బ్యాక్ అందుకుంటారో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తుండగా దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :