“మెగా 154” సెట్స్ నుంచి లేటెస్ట్ పిక్ వైరల్..!

“మెగా 154” సెట్స్ నుంచి లేటెస్ట్ పిక్ వైరల్..!

Published on Sep 24, 2022 7:00 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సాలిడ్ ఎంటర్టైనర్ “గాడ్ ఫాథర్” విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న తరుణంలోనే మెగాస్టార్ తన ఇతర సినిమాల షూటింగ్స్ కోసం కూడా సమయం కేటాయిస్తూ చాలా బిజీ బిజీగా ఉన్నారు. మరి ఈ చిత్రాల్లొ అయితే తాను నటిస్తున్న 154 వ సినిమా నుంచి లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జాతీయ స్థాయి విలేఖరి మెగాస్టార్ తో ఇంటర్వ్యూ కోసం రాగా ఆమెతో షూటింగ్ సెట్స్ నుంచే చిరు ఫోటో దిగారు. దీనితో ఈ సెట్స్ నుంచి వచ్చిన ఈ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక అలాగే ఈ ఫోటో బాగా చూస్తే ఏదో సాంగ్ లా కూడా అనిపిస్తుంది. మరి మొత్తానికి అయితే ఈ పిక్ ఇప్పుడు మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు