వైరల్ పిక్ : మెగాస్టార్ తో సల్మాన్ స్టెప్స్

Published on Jul 29, 2022 5:02 pm IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మొత్తం మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఇవి మూడు వేటికవే మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ అనే చెప్పాలి. ఇక వాటిలో మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న గాడ్ ఫాదర్ మూవీ ఒకటి. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ లో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి దీనిని నిర్మిస్తున్నాయి.

అయితే ఈ మూవీ ద్వారా తొలిసారిగా తెలుగు తెరపై కనిపించనున్నారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. గాడ్ ఫాదర్ లో ఒక సర్ప్రైజింగ్ రోల్ చేస్తున్న సల్మాన్, ఇందులో మెగాస్టార్ తో కలిసి ఒక సాంగ్ లో కనిపించనున్నారు. ఇక దీనికి సంబందించిన ఒక క్రేజీ పిక్ ని కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. తొలిసారిగా సల్మాన్ తో కలిసి డ్యాన్స్ చేయడం ఎంతో అద్భుతంగా ఉంది, తప్పకుండా ఇది ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరికీ మంచి ఐ ఫీస్ట్ ని అందిస్తుందని తన పోస్ట్ లో తెలిపారు మెగాస్టార్. కాగా ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :