భారీ ఆఫర్స్ వదులుకున్న మెగాస్టార్..ఇప్పుడప్పుడే బాస్ నో ఛాన్స్.?

Published on Oct 17, 2021 4:30 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కాలంలో ఓటిటి రంగం కూడా చాలా పాపులర్ కావడంతో అనేక మంది స్టార్స్ ఓటిటి కి సై అని రకరకాలుగా వినోదం అందిస్తున్నారు. అయితే రీసెంట్ గా నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఓ ఓటిటి షోకి ఓకే చెప్పి ఆశ్చర్యపరిచారు.

మరి అలా బాస్ ఓటిటి ఎంట్రీ పై మాత్రం ఎప్పుడు నుంచో బజ్ ఉంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ ఎంట్రీపై క్లారిటీ వినిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే బాస్ ఈ ఓటిటి షోలు ఇతర వెబ్ కంటెంట్ పై పెద్ద ఇంట్రెస్టెడ్ గా లేరట. ఇంకో సంకాహారం ఏమిటంటే ఓ సంస్థ మెగాస్టార్ కి భారీ ఆఫర్ ఇచ్చి హోస్ట్ గా చెయ్యమని అడిగినా దానికి చిరు నో చెప్పేశారట.

ఇప్పుడప్పుడే చేసే ఉద్దేశం లేకపోవడమే అని కాకుండా ప్రస్తుతం లాక్ చేసిన సినిమాలు తర్వాత చేసిన మరిన్ని సినిమాలు కూడా చిరు ఒప్పుకోవడం మూలాన బాస్ ఎంట్రీ ఇప్పుడప్పుడే ఉండదు అని తెలుస్తుంది. ఈ కారణాల వల్ల మెగాస్టార్ ఇప్పుడప్పుడే ఓటిటిపై రావడం జరగదని కన్ఫర్మ్ అయ్యింది.

సంబంధిత సమాచారం :