వైరల్ పోస్ట్ : బ్రహ్మానందం గారికి మెగాస్టార్ స్పెషల్ బర్త్ డే విషెస్

Published on Feb 1, 2023 6:42 pm IST

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కమెడియన్ గా దాదాపుగా వెయ్యి కి పైగా సినిమాల్లో నటించి తన ఆకట్టుకునే కామెడీ స్టైల్ తో ఆడియన్స్ నుండి గొప్ప పేరు సంపాదించిన నటుడు బ్రహ్మానందం గారు. దివంగత దర్శకుడు జంధ్యాల గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఆహ నా పెళ్ళంట మూవీ ద్వారా టాలీవుడ్ కి కమెడియన్ గా పరిచయం అయ్యారు బ్రహ్మానందం. ఇక అక్కడి నుండి అనేక సినిమాల్లో తన కడుపుబ్బా నవ్వించే కామెడీ టైమింగ్ తో అలరించిన బ్రహ్మానందం నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు సినీ ప్రేక్షకాభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు.

ఇక కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా బ్రహ్మానందం గారికి స్పెషల్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. అత్తిలిలో లెక్చరర్ గా పని చేసి ప్రపంచంలోనే అత్యధిక సినిమాల్లో నటించి ప్రపంచ రికార్డు సాధించిన పద్మశ్రీ భ్రహ్మనందం కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, ఆయన ఇలాగే జీవితాంతం పదిమందిని నవ్విస్తూ సంతోషమైన జీవితాన్ని గడపాలని, అలానే ఆయనకు మంచి భవిష్యత్తు లభించాలని కోరుతూ మెగాస్టార్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :