“వాల్తేరు వీరయ్య”కి ఈ వర్క్ కూడా స్టార్ట్ చేసేసిన మెగాస్టార్?

“వాల్తేరు వీరయ్య”కి ఈ వర్క్ కూడా స్టార్ట్ చేసేసిన మెగాస్టార్?

Published on Nov 16, 2022 12:15 AM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు కె ఎస్ రవీంద్ర తో చేస్తున్న భారీ యాక్షన్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతూ ఉండగా మరో పక్క ఆల్రెడీ ఇతర ముఖ్యమైన పనులు అన్నీ కూడా సినిమాకి కంప్లీట్ అయ్యిపోతున్నాయి.

ఇక ఇప్పుడు అయితే మెగాస్టార్ తన డబ్బింగ్ వర్క్ ని కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసినట్టుగా తెలుస్తుంది.అలాగే మెగాస్టార్ సినిమాలో చాలా వరకు డబ్బింగ్ కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు