మెగాస్టార్ 151వ సినిమాకు డిస్కషన్స్ షురూ..!
Published on Jan 10, 2017 8:39 am IST

chiru
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రంగం సిద్ధమైపోయింది. జనవరి 11న తారాస్థాయి అంచనాల మధ్యన విడుదలవుతోన్న ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఈ సినిమా విషయం అలా ఉంచితే, మెగాస్టార్ నటించబోయే తదుపరి సినిమాకు కూడా ఇప్పట్నుంచే రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చిరు తెలుగులోని పలు స్టార్ డైరెక్టర్స్‌తో చర్చలు కొనసాగిస్తున్నారు.

సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను లాంటి దర్శకులతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. అదేవిధంగా చిరు ఎంతో ఇష్టంగా చేయాలనుకున్న ఉయ్యాలవాడ నర్సింహ్మారెడ్డి స్క్రిప్ట్ కూడా ఆలోచనలో ఉందట. మరి ఈ ప్రాజెక్టుల్లో ఏది ఫైనలైజ్ అవుతుందన్నది తెలియాల్సి ఉంది. ఇక ఖైదీ విషయానికి వస్తే, వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మించగా, కాజల్ హీరోయిన్‌గా నటించారు.

 
Like us on Facebook