ఇప్పుడు చిరంజీవి దృష్టంతా ఆ ఒక్క విషయం మీదే ఉంది !
Published on Oct 12, 2017 3:17 pm IST

మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రంతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు 151వ సినిమాగా స్వాతంత్ర్య సమరయోధుడు నరసింహారెడ్డి కథను ఎంచుకున్న సంగతి తెలిసిందే. చిరు ఈ సినిమాని అన్ని సినిమాల్లా కాకుండా ఒక ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు. ఏ విషయంలోనూ వేలెత్తి చూపడానికి లేకుండా సినిమాను తీయాలని కృత నిశ్చయంతో పని చేస్తున్నారు. ముఖ్యంగా కథ, విజువల్ ఎఫెక్ట్స్, లుక్స్ పరంగా ఎక్కువగా శ్రద్ద పెడుతున్నారు.

‘బాహుబలి-2’ విజయం తర్వాత ఈ శ్రద్ద మరింత ఎక్కువైంది. ఆ సినిమాతో ఇకపై వచ్చే హిస్టారికల్ సినిమాల్లో గ్రాఫిక్స్ అన్నీ అదే స్థాయిలో ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అందుకే ఆర్ట్ వర్క్ దగ్గర్నుండి చిరు, ఇతర నటీనటుల మేకోవర్, లొకేషన్స్ అన్నీ పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు టీమ్. ఆ పర్ఫెక్షన్ కోసమే టీమ్ ఎక్కువ సమాయన్ని తీసుకుని పనిచేస్తున్నారు. అందుకే సినిమా ప్రారంభానికి ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తోంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు.

 
Like us on Facebook