‘శతమానంభవతి’ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ !


ఈ సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాల మధ్య విడుదలై భారీ పోటీని తట్టుకుని ఘన విజయం సాధించిన చిత్రం ‘శతమానంభవతి’. కుటుంబ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే దాదాపు రూ. 25 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. చిత్రం ఇంతటి ఘన సొంతం చేసుకోవడాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈరోజు హైదారాబాద్లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయనుంది.

ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. దీంతో ఈ వేడుక ప్రత్యేకతను సంతరించుకుంది. ముందుగా ఓవర్సీస్ లో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. దర్శకుడు సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన ఈ సినిమా హీరో శర్వానంద్ కెరీర్లో భారీ విజయంగా నిలవడమేగాక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సైతం అందించింది.