వారితో మెగాస్టార్ చిరంజీవి కీలక భేటీ..?

Published on Oct 13, 2021 3:20 pm IST


మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై కొన్ని కోట్లమందికి ఆరాధ్య దైవం అని అందరికీ తెలిసిందే. అంతే కాకుండా ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో పరిచయం అవుతూ నిలదొక్కుకుంటున్న ఎందరో యువ హీరోలకు కూడా మెగాస్టార్ నే ఆదర్శం అని చెబుతారు. మరి ఒక హీరో గానే కాకుండా నిజ జీవితంలో కూడా మెగాస్టార్ సేవా కార్యక్రమాలు అయితే అనేకం. అలానే గత కరోనా సంక్షోభం సమయంలో తన ట్రస్ట్ పేరిట సినీ కార్మికులకు అండగా ఉన్నారు.

ఇక రెండో వేవ్ లో అయితే ఆక్సిజన్ కొరత చూసి చాలించి పోయి తన కష్టార్జితం ఏకంగా 30 కోట్లకి పైగా వ్యయంతో ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేసి ఎంతోమందికి ప్రాణదానం చేసిన వారు అయ్యారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతీ ఒక్క జిల్లాలోని మెగాస్టార్ అభిమానులు ఈ కార్యక్రమంని ముందుండి నడిపించి విజయవంతం చేశారు.

మరి తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ఆక్సిజన్ ఆర్గనైజర్స్ తో ఇప్పుడు ఒక కీలక భేటీ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎలాంటి అంశాలపై చర్చిస్తారో అన్నవాటిపై ఇంకా సమాచారం లేదు కానీ బహుశా థర్డ్ వెవ్ పై సన్నద్ధం అవ్వడానికి ఏమో కావచ్చు. మరి ప్రస్తుతం అయితే మెగాస్టార్ తన “గాడ్ ఫాథర్” లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :