క్రేజీ బజ్ : ఆ తమిళ డైరెక్టర్ తో వర్క్ చేయనున్న మెగాస్టార్ ?

Published on Mar 11, 2023 1:00 am IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గాడ్ ఫాదర్ లేటెస్ట్ గా వాల్తేరు వీరయ్య సినిమాల ద్వారా హీరోగా రెండు వరుస సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కి రీమేక్ అయిన భోళా శంకర్ మూవీలో నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ కీలక పాత్ర చేస్తుండగా మహతి స్వరసాగర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలు కలిసి దీనిని గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న భోళా శంకర్ మూవీ మరికొద్ది నెలల్లో ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం అతి త్వరలో కోలీవుడ్ దర్శకుడు పీఎస్ మిత్రన్ తో మెగాస్టార్ చిరంజీవి ఒక మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విశాల్ తో అభిమన్యుడు, కార్తీ తో సర్దార్ వంటి సక్సెస్ఫుల్ మూవీస్ తీశారు మిత్రన్. కాగా వీరిద్దరి క్రేజీ కాంబో మూవీకి బివిఎస్ రవి కథను అందించనున్నారని, అలానే ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :