వైరల్ అవుతున్న మెగాస్టార్ సూపర్ వింటేజ్ పిక్.!

Published on May 21, 2022 8:00 am IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వాటిలో రీసెంట్ గా వచ్చిన “ఆచార్య” అనుకోని ఫలితాన్ని చూడాల్సి వచ్చింది. అయినా కూడా మెగాస్టార్ కల్ట్ ఫ్యాన్స్ అయితే ఈ ఏజ్ లో కూడా బాస్ డెడికేషన్ చూసి గర్వపడుతున్నాం అని చెప్పారు. అయితే హిట్ లేదనే వెలితి మాత్రం లేకపోలేదు. అయితే ఇలా ఉన్న వారికి ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకటి మెగాస్టార్ ది ఫుల్ కిక్ ఇస్తుంది.

బహుశా మెగాస్టార్ నటించిన చిత్రం బిగ్ బాస్ టైం లో దానిలా అది చూస్తే అనిపిస్తుంది. పొడవాటి శిరోజాలు మాంచి రఫ్ లుక్ గడ్డం తో మెగాస్టార్ నుంచి ఒక అన్ సీన్ ఫోటోగా ఇది బయటకి వచ్చింది. దీనితో ఎప్పటిదో చూడని స్టిల్ అది కావడంతో ఈ ఫోటో ఇప్పుడు మెగా ఫాన్స్ మరియు సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుంది. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ అయితే ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ తదితర చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :