తన సాలిడ్ ప్రాజెక్ట్ లో సల్లూ భాయ్ కి వెల్కమ్ చెప్పిన మెగాస్టార్.!

Published on Mar 16, 2022 10:00 am IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో దర్శకుడు మోహన్ రాజా తో తెరకెక్కిస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ “గాడ్ ఫాథర్” కూడా ఒకటి. ఈ భారీ సినిమా మళయాళ సూపర్ స్టార్ “లూసిఫర్” కి రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడని ఎప్పుడు నుంచో టాక్ ఉంది.

మరి ఇప్పుడు దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అధికారిక కన్ఫర్మేషన్ ఇచ్చారు. తమ సినిమాలోకి భాయ్ సల్మాన్ ని ఆహ్వానిస్తున్నట్టుగా అనౌన్స్ చేస్తున్నామని నీతో వర్క్ చెయ్యడం డెఫినెట్ గా మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది అని అలాగే తన రాకతో సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది అని చిరు తెలిపారు. దీనితో ఈ మెగా అప్డేట్ ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :