వేరే లెవెల్ మాస్ తో మెగాస్టార్ ని చూపిస్తారట.!

Published on Oct 21, 2021 8:00 am IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రెండు సాలిడ్ రీమేక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వీటితో పాటుగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తీసిన స్ట్రెయిట్ చిత్రం “ఆచార్య” అయితే ఆల్రెడీ రెడీ గా ఉంది. మరి వీటి తర్వాత మరో స్ట్రెయిట్ చిత్రాన్ని మెగాస్టార్ దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

అలాగే మొన్న మెగాస్టార్ బర్త్ డే కానుకగా వచ్చిన ప్రీ లుక్ పోస్టర్ తో కూడా మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేశారు. అయితే ఇపుడు లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఈ సినిమాలో మెగాస్టార్ తో మళ్ళీ వేరే లెవెల్ మాస్ ని చూపించబోతున్నారట. తన రోల్ కంప్లీట్ గా ఈ సినిమా నుంచి పక్కా మాస్ గా ఉంటుందని సినీ వర్గాల్లో నడుస్తున్న ట్రెండింగ్ టాక్. ఆల్రెడీ ప్రీ లుక్ పోస్టర్ లోనే “ముఠామేస్త్రి” వైబ్స్ ని దర్శకుడు సృష్టించారు. ఇక సినిమా ఎలా ఉంటుందో అన్నది వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :