ఇంట్రస్టింగ్ బజ్ : పవర్ స్టార్ ఫ్యాన్ గా కనిపించనున్న మెగాస్టార్ ?

Published on Feb 20, 2023 8:31 pm IST


ఇటీవల గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుసగా రెండు సక్సెస్ లు సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, లేటెస్ట్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ భోళా శంకర్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలపై ఎంతో భారీ స్థాయిలో నిర్మితం అవుతున్న ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కి రీమేక్ గా రూపొందుతున్న భోళా శంకర్ కి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా డూడ్లీ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఒక లేటెస్ట్ ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో క్రేజీ గా మారింది. అదేమిటంటే ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, తన సోదరుడు, నటుడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానిగా కనిపించనున్నారట. సినిమాలో ఆ సీన్స్ మెగా ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజమే అయితే మెగా ఫ్యాన్స్ కి ఇది పండుగే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :