మెగాస్టార్ అదే ఎనర్జీతో “ఆచార్య” లేటెస్ట్ సాంగ్ ప్రోమో.!

Published on Jan 2, 2022 12:00 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. ఎప్పుడు నుంచో మెగా ఫ్యాన్స్ ని ఊరిస్తూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అవుతుండగా ఇప్పుడు మేకర్స్ సరికొత్త అప్డేట్ తో పలకరించారు.

ఈ సినిమా నుంచి మూడో సాంగ్ కి సంబంధించిన లిరికల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇది కూడా మణిశర్మ మార్క్ లోనే మంచి క్యాచీ గా కూడా ఉండగా ఇందులో మెగాస్టార్ ఎనర్జీ కానీ తన గ్రేస్ కానీ ఏమాత్రం చెక్కు చెదరకుండా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సాంగ్ లో యంగ్ హీరోయిన్ రెజీనా ఐటెం బ్యూటీగా కనిపించడం గమనార్హం.

మొత్తానికి అయితే ఈ ప్రోమో మంచి ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. ఇక రేపు వచ్చే టోటల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటించగా కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించారు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :