పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా మెగాస్టార్ “ఆచార్య” ట్రైలర్!

Published on Apr 12, 2022 6:20 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మాట్ని ఎంటర్ టైన్మెంట్ పతాకాల పై నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో మరొక పవర్ ఫుల్ పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ కాంబో కి సంగీత స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ సినిమా కి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ రామ్ చరణ్ వాయిస్ వోవర్ తో మొదలై, పవర్ ఫుల్ డైలాగ్స్ తో నిండి ఉంది. ఆద్యంతం ఆసక్తికరం గా యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ ల డైలాగ్స్ ట్రైలర్ లో ఆకట్టుకోగా, సోనూ సూద్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు.

ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, పూజా హెగ్డే రామ్ చరణ్ సరసన కనిపించనుంది. ఏప్రిల్ 29, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కాబోతున్న ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :