మెగాస్టార్ “గాడ్ ఫాదర్” రిలీజ్ డేట్ ఫిక్స్?

Published on May 10, 2022 10:50 am IST


మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి మరో 2 నుండి 3 సినిమాలు చేస్తున్నారు. వాటిలో మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ చిత్రం ఒకటి. తాజా గాసిప్ ఏమిటంటే గాడ్ ఫాదర్ మేకర్స్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవానికి మూడు రోజుల ముందుగా 2022 ఆగస్టు 12న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని టీమ్ నుంచి ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, గాడ్ ఫాదర్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :