మెగాస్టార్ “గాడ్ ఫాదర్” సెట్స్ నుండి పవర్ ఫుల్ ఫోటో రిలీజ్

Published on Mar 21, 2022 8:03 pm IST

మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవలే ముంబైలో ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ షెడ్యూల్‌లో మెగా నటుల మధ్య కొన్ని ప్రధాన సన్నివేశాలను రూపొందించారు.

మూవీ మేకర్స్ ఈ రోజు ఒక సరికొత్త ఫోటో ను విడుదల చేశారు. ఈ ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్ గా మారుతోంది. గాడ్‌ఫాదర్‌లో కథానాయికగా నయనతార ఎంపికైంది. ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సూపర్ గుడ్ ఫిల్మ్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :