చిరంజీవి – అనిల్ రావిపూడి మ్యాజిక్: USAలో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీ-సేల్స్ జోరు!

msg 1

ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu ) సినిమాతో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియెన్స్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

అమెరికాలో మొదలైన బుకింగ్స్ జోరు

మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) రిలీజ్ కి ఇంకా సమయం ఉన్నప్పటికీ, USAలో అప్పుడే ఈ మూవీ క్రేజ్ మొదలైంది. అక్కడ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కేవలం తక్కువ స్క్రీన్స్ లోనే బుకింగ్స్ ఓపెన్ కాగా ఈ సినిమా లక్ష డాలర్స్ (సుమారు 80 లక్షల రూపాయలు) ప్రీ-సేల్స్ మార్క్ ను క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. జనవరి 11, 2026న USAలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ప్రీమియర్స్ సమయానికి ఈ కలెక్షన్స్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

భారీ తారాగణం – గ్రాండ్ రిలీజ్

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను జనవరి 12, 2026న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయడానికి షెడ్యూల్ చేశారు. ఈ సినిమాలో మెగాస్టార్, నయన్ అలాగే వెంకీ మామ సహా క్యాథరిన్ థ్రెసా, సునీల్, VTV గణేష్, రేవంత్, హర్ష వర్ధన్, సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమఠం వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

పెరుగుతున్న హైప్

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన బజ్ (Buzz) చాలా బాగుంది. త్వరలో రాబోయే ట్రైలర్ తో ఈ హైప్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ కోసం మేకర్స్ ఒక స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version