సీనియర్ నిర్మాతతో మేఘామ్ష్ శ్రీహరి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!

Published on Aug 15, 2021 5:26 pm IST

ఈరోజు ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవమే అని కాకుండా మన టాలీవుడ్ కి చెందిన వెర్సిటైల్ అండ్ స్వర్గీయ నటులు రియల్ స్టార్ శ్రీహరి గారి జన్మదినం కూడా. మరి ఈ సందర్భంగా పలువురి సినీ ప్రముఖులు మరియు సన్నిహితులు ఆయన్ని గుర్తు చేసుకున్నారు. మరి ఈ వెరీ స్పెషల్ డే న శ్రీహరి తనయుడు మేఘామ్ష్ శ్రీహరి హీరోగా నటించనున్న సరికొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కాబడింది..

ఇది వరకే కొన్ని సినిమాలు చేసిన మేఘ ఇప్పుడు ప్రముఖ సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో సినిమా చేసేందుకు సన్నద్ధం అయ్యాడు. నందు మల్లెల దర్శకత్వంలో “రాసిపెట్టుంటే” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసి అనౌన్స్ చేసారు. అలాగే ఈ చిత్రాన్ని ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించనున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్. మరి ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారాన్ని త్వరలోనే రివీల్ చేయనున్నట్టుగా తెలిపారు.

సంబంధిత సమాచారం :