జక్కన్న పై చిరు ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

Published on Feb 23, 2023 12:00 pm IST

ఇప్పుడు వరల్డ్ వైడ్ మన తెలుగు సినిమా గాని ఇండియన్ సినిమా పేరు ఎంతగానో వినిపిస్తుంది అంటే దానికి కారణం మాస్టర్ స్టోరీ టెల్లర్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పాలి. తాను వేసిన బాటలో ఇండియన్ సినిమా దగ్గర అన్ని భాషల్లో కూడా అనేక పాన్ ఇండియా సినిమాలు మొదలు కావడం మొదలయ్యాయి. అలాగే సీక్వెల్స్ ని కూడా నిర్మొహమాటంగా ప్లాన్ చేసుకోడానికీ తానే దారి వేశారు.

మరి తాను లేటెస్ట్ గా చేసిన “రౌద్రం రణం రుధిరం” చిత్రం వరల్డ్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో నిలబడింది. దీనితో సినిమాలో నటించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి రీసెంట్ గా యూఎస్ ఫేమస్ షో “గుడ్ మార్నింగ్ అమెరికా” కి గాను తాను హాజరు కావడం మొట్టమొదటి ఇండియన్ నటుడుగా తెలుగు సినిమాకి మరియు భారతీయ సినిమా దగ్గర నిలిచాడు. మరి దీనితో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి చరణ్ పై పోస్ట్ పెట్టి చరణ్ ప్రెజెన్స్ తో గర్వ కారణం అని హర్షం వ్యక్తం చేశారు.

అలాగే దర్శకుడు రాజమౌళి పై కూడా పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజనరీ రాజమౌళి మెదడు లో మెదిలిన అద్భుతమైన ఆలోచన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దాని పవర్ ఏంటో చూపిస్తుంది అని జక్కన్న ని కొనియాడారు. దీనితో మెగా విషెష్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం అయితే చిరు తన లేటెస్ట్ రీమేక్ భోళా శంకర్ తో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :