చిరు “భోళా శంకర్” కి దర్శకత్వం వహించడం పై మెహర్ రమేష్ కీలక వ్యాఖ్యలు!

Published on Nov 11, 2021 6:31 pm IST


మెగాస్టార్ చిరంజీవి ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఒక సినిమా తర్వాత మరొక చిత్రం చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళం లో సూపర్ హిట్ సాధించిన వేదాళం చిత్రం కి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లి పాత్ర లో టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుండగా, తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖులు ఈ కార్యక్రమం కి విచ్చేశారు. అయితే మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కి దర్శకత్వం వహిస్తుండటం పట్ల కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నా జీవితం లో బెస్ట్ మూమెంట్స్ ఇవే అంటూ చెప్పుకొచ్చారు. నా ఆల్ టైమ్ సూపర్ హీరో, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కి దర్శకత్వం వహించడం నా కల, అది నిజం అయ్యింది. ఈ చిత్రం కోసం నా వంతు కృషి చేస్తాను అని అన్నారు. అంతేకాక చిరంజీవి గారిని హిమాలయాల తో పోల్చుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు మెహర్ రమేష్.

రఘుబాబు, రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మహతి స్వర సాగర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More