ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి లాంటి టాప్ స్టార్లతో సినిమాలు తీసిన దర్శకుడు మెహర్ రమేష్. అయితే ఆయన తెరకెక్కించిన ‘భోళా శంకర్’ డిజాస్టర్ తర్వాత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నారు. కాగా, ఆయన తాజాగా ఒక క్రేజీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
దీనికి సంబంధించిన కొంత షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందని సమాచారం. గతంలో మహేష్ బాబు ‘బాబీ’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో మెరిసిన మెహర్ రమేష్.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం సరదాగా చేసిన పాత్రనా లేదా నటుడిగా సీరియస్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.
అయితే, డైరెక్షన్ పక్కనబెట్టి యాక్టింగ్ వైపు మెహర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారేమో అనుకుంటే పొరపాటే. ఆయన దర్శకుడిగా కూడా ఒక కథను సిద్ధం చేసుకుని హీరోల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మెహర్ రమేష్ ఇప్పుడు కెమెరా వెనకాల నుంచి కాకుండా కెమెరా ముందు నుంచి కూడా హాట్ టాపిక్ అయ్యేందుకు సిద్ధమయ్యాడు.
