మెగా హీరోకి హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ !

26th, December 2016 - 01:17:38 PM

Mehreen
‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మెహ్రీన్ కౌర్. ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ మెహ్రీన్ కు అవకాశాలు వెంటనే దొరకలేదు. ఆమె కూడా మంచి ప్రాజెక్టుల కోసం కొంత కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ ఎదురు చూపులకు ఫలితంగా ప్రస్తుతం ఆమెకు మంచి సినిమాలు దొరుకుతున్నాయి. ఈ మధ్య శర్వానంద్ హీరోగా మారుతి డైరెక్ట్ చేస్తున్న ‘మహానుభావుడు’ చిత్రంలో ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నారని వార్త బయటికొచ్చింది.

మళ్ళీ ఇప్పుడు తాజాగా మెహ్రీన్ మెగా హీరో సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. ఆ మెగా హీరో ఎవరో కాదు వరుణ్ తేజ్. త్వరలో వరుణ్ తేజ్, వెంకీ అట్లూరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారట. ఈ సినిమా కథ వినగానే మెహ్రీన్ వెంటనే ఓకే చెప్పిందని, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సంబంధిత వ్యక్తుల నుండి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇకపోతే వరుణ్ తేజ్ శేఖర్ కమ్ములతో ‘ఫిదా’, శ్రీను వైట్లతో ‘మిస్టర్’ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.