బన్నీ కొత్త సినిమాలో నాని హీరోయిన్ ?

7th, September 2016 - 10:49:03 AM

Mehreen
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్తగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘డీజే – దువ్వాడ జగన్నాథం’. కొద్దిరోజుల క్రితమే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం అవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే దానిపై ఇప్పటి వరకూ దర్శకుడు గాని, నిర్మాత గాని ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మొదట కాజల్ అగర్వాల్ ఆ తరువాత పూజా హెగ్డే ల పేరు వినిపించినా ఇప్పుడు వారెవరూ కాదని తెలుస్తోంది.

పైగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంలో నాని సరసన హీరోయిన్ గా నటించి, మంచి మార్కులు కొట్టేసిన మెహ్రీన్ ను హీరోయిన్ గా తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయని కానీ ఇంకా విషయం ఫైనల్ కాలేదని తెలుస్తోంది. ఇకపోతే దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా, బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ ఆయాంకా బోస్ సినిమాటోగ్రఫీ విభాగ బాధ్యతలు చేపట్టనున్నారు.